ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో పాఠశాలల విలీనం. ఇది ఇపుడు అధికార వైకాపా ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంది. పాఠశాలలో విలీనంపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారికి సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు సతమతమవుతున్నారు.
తాజాగా సెగ మంత్రి రోజాకు తగిలింది. పాఠశాలల విలీన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది.
స్కూల్స్ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి యాత్రను మొదలుపెట్టిన యూటీఎఫ్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వరకు కొనసాగింతుంది. ఇక్కడ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుుకున్నారు.
తమ గ్రామంలో పాఠశాల లేకపోతే తమ పిల్లల్ని ఎక్కడికి పంపి చదివించుకోవాలని వారు నిలదీశారు. కాగా, మంత్రి రోజా నియోజకవర్గంలోనే దాదాపు 18 స్కూల్స్ విలీనం దెబ్బకు మూతపడనున్నాయి.