Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశాన్ని అమూలాగ్రం మార్చేందుకు ప్రధాని మోడీ చర్యలు : కేంద్రమంత్రి వెంకయ్య

దేశాన్ని అమూలాగ్రం మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడుం బిగించారని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు. స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 'స్వచ్ఛసర్వేక్షన్‌-వావ్‌ హైదరాబా

Advertiesment
union minister venkaiah naidu
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:58 IST)
దేశాన్ని అమూలాగ్రం మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడుం బిగించారని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు. స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 'స్వచ్ఛసర్వేక్షన్‌-వావ్‌ హైదరాబాద్‌' కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అమూలాగ్రం మార్చాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు. నేటి అవసరాలకు కాక.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేయాలి. ఉచితంగా అన్నీ ఇవ్వడం సరికాదు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చడం అంతసులభం కాదు. అందరి మనసు పరిశుభ్రంగా మారితేనే దేశం పరిశుభ్రమవుతుందని చెప్పారు. పారిశుద్ధ్య పరిరక్షణకు మూడు సూత్రాలు కావాలి. మనసులో మార్పు, అవసరమైన వసతుల కల్పన, ఆచరణ అనే సూత్రాలను అమలు చేయాలి. అందరూ స్వచ్ఛాగ్రహి కావాలి. స్వచ్ఛభారత్‌ను ప్రజా ఉద్యమంగా చేయాలని ప్రధాని సూచించారు'' అని వెంకయ్య అన్నారు. 
 
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛభారత్ ప్రచారకర్త పుల్లెల గోపీచంద్ పాల్గొని మాట్లాడారు. 'కుటుంబంగా మనమంతా కలిసి ఉందాం.. తడి, పొడి చెత్తను వేరు చేద్దాం' అని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌ నినాదంతో భారత్‌ ముందుకు వెళ్తొందన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ సీతారామ్‌నాయక్‌, ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, తీగల కృష్ణారెడ్డి, లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, కిషన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు వాస్తు కంపల్సరీ.. మరి పేదలకు వాస్తుకు విరుద్ధంగా గృహాలా? ఏంటిది?