Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్‌కు వాస్తు కంపల్సరీ.. మరి పేదలకు వాస్తుకు విరుద్ధంగా గృహాలా? ఏంటిది?

వాస్తును బాగా నమ్మే తెలంగాణ సీఎం కేసీఆర్ పేదలు నివసించే ఇళ్లను వాస్తుకు విరుద్ధంగా నిర్మించడం ఏమిటని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎర్రవెల్లి, నర్సన్

Advertiesment
Vasavi vastu planners chief prakash fires on kcr
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:22 IST)
వాస్తును బాగా నమ్మే తెలంగాణ సీఎం కేసీఆర్ పేదలు నివసించే ఇళ్లను వాస్తుకు విరుద్ధంగా నిర్మించడం ఏమిటని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు వాస్తుదోషం ఉందని ఆరోపణలు చేశారు. 
 
బషీర్‌బాగ్‌లో విలేకరుల సమావేశంలో ప్రకాష్‌ మాట్లాడుతూ... ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో దాదాపు 600ల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి శుక్రవారం వీటిని ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణంలో వాస్తు దోషాలు ఉన్నాయని, వీటిలో నివసించే వారు ఆర్థికంగా అనారోగ్యంగా చితికిపోతారన్నారు. ఇప్పటికైనా డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్ధతో అవి త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్‌కు ఒబామా చెక్: ఎన్ఎస్ఈఈఆర్ఎస్ చట్టం రద్దు.. ముస్లింలపై?