Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముచ్చుమర్రి బాలిక హత్య కేసు ... ఇద్దరు పోలీసులపై వేటు!!

tirumala rao

వరుణ్

, బుధవారం, 17 జులై 2024 (18:05 IST)
ఏపీలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావు తీసుకున్నారు. కర్నూలు రేంజి డీఐజీ విజయరావు, ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌లను సస్పెండ్ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ తిరుమల రావు హెచ్చరించారు. 
 
కాగా, ముచ్చుమర్రిలో ఓ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఓ నిందితుడు తమ పెద్దలకు తెలియజేయగా అందులో ఓ బాలుడు తండ్రి, బాలుడి పెదనాన్న బాలిక మృతదేహాన్ని రాళ్లు కట్టి కృష్ణానదిలో పడేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, బాలిక మృతదేహం కోసం కృష్ణానదిని జల్లెడపడుతున్నారు. అయినప్పటికీ మృతదేహం ఆచూకీ తెలియడం లేదు. 
 
మైనర్లు అత్యాచారం చేసి చంపేశారు.. శవాన్ని తండ్రి మాయం చేశాడు.. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకుని పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. బాలికను అత్యాచారం చేసిన ముగ్గురు మైనర్లు.. ఆపై హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు శవాన్ని మాయం చేశారు. 
 
ఈ దారుణానికి పాల్పడిన మైనర్లకు నిండా 15 యేళ్ళుకూడా నిండలేదు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి చదువుతుండగా, మరో బాలుడు ఆరో తరగతి చదువుతుండడం గమనార్హం. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. 
 
ఇలా చేయాలని మీకెలా తెలిసిందని ప్రశ్నిస్తే నివ్వెరపోయే విషయం చెప్పారు. ఇవన్నీ ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. శవాన్ని ఎలా మాయం చేశారన్న ప్రశ్నకు మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడంలో ఓ బాలుడి తండ్రి, పెదనాన్న పాత్ర ఉందని తెలిసి వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
 
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు విషయాన్ని ఎక్కడ బయటపెట్టేస్తుందోనని భయపడి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని తీసుకెళ్లి కేసీ కెనాల్ దగ్గర ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఒకడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలుడి తండ్రి, పెదనాన్ని కలిసి మృతదేహాన్ని బైకుపై వనుములపాడు మీదుగా కృష్ణా నది వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అలానే పడేస్తే తేలుతుందని భావించి బండరాయి కట్టి నీటిలో పడేశారు. 
 
కాగా, నిందితులు చెప్పిన ప్రాంతంలో గాలించినా మృతదేహం దొరక్కపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాలిక మృతదేహం లభించే వరకు గాలింపు కొనసాగుతుందని నద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. మరోవైపు, ఈ కేసులో నిందితులైన బాలురను పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన కాటం యోహాన్, బొల్లెద్దుల సద్గురుడును రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌‌పై రఘురామ కృష్ణ రాజు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? మూడేళ్ల కిందట ఏం జరిగింది?