Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు ట్యూబ్‌లెస్ టైర్లు వాడటం లేదా.. ఇది చదవాల్సిందే?

ఈ రోజుల్లో కార్లు చాలామందికే ఉన్నాయి. ఇక బైక్‌లు చెప్పే పనేలేదు. ఆడామగా అని తేడా లేకుండా బైకులను మెయింటైన్ చేస్తున్నారు. అయితే మనం రోజూ వాడే వాహనాలకు అప్పుడప్పుడు పంక్చర్ పడుతుండటం సర్వసాధారణం. కంగారు కంగారుగా ఆఫీసుకు, కాలేజీలకు, ఇతర పనుల కోసం వెళ్ళ

మీరు ట్యూబ్‌లెస్ టైర్లు వాడటం లేదా.. ఇది చదవాల్సిందే?
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (19:50 IST)
ఈ రోజుల్లో కార్లు చాలామందికే ఉన్నాయి. ఇక బైక్‌లు చెప్పే పనేలేదు. ఆడామగా అని తేడా లేకుండా బైకులను మెయింటైన్ చేస్తున్నారు. అయితే మనం రోజూ వాడే వాహనాలకు అప్పుడప్పుడు పంక్చర్ పడుతుండటం సర్వసాధారణం. కంగారు కంగారుగా ఆఫీసుకు, కాలేజీలకు, ఇతర పనుల కోసం  వెళ్ళేటప్పుడు, వాహనం పంక్చర్ అవుతుంటుంది. అప్పట్లో పంక్చర్ పడితే అదొక తతంగం. పంక్చర్ అయితే టైర్ తీసి పంక్చర్ వేసి బిగించాలి. దీంతో చాలా టైం పడుతుంది.
 
కానీ ఇప్పుడు ట్యూబ్‌లెస్ టైర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. చాలా వాహనాలకు ట్యూబ్‌లైస్ టైర్లు ఉన్నాయి. సాధారణ టైర్లతో పోలిస్తే ట్యూబ్‌లెస్ టైర్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. నిజానికి ట్యూబ్‌లెస్ టైర్లకు పంక్చర్లు జరగవా అంటే చాలా తక్కువగా జరగుతాయనే చెప్పాలి. అయితే ట్యూబ్‌లెస్ టైర్లకు పంక్చర్ వేయడం చాలా ఈజీ. పొడవాటి మేకులు దిగితే తప్ప ట్యూబ్‌లెస్ టైర్లు పంక్చర్ కావు. 
 
తక్కువ గాలితో కూడా ట్యూబ్‌లెస్ టైర్లను నడపవచ్చు. ట్యూబ్‌లెస్ టైర్లలో ఒక లిక్విడ్ ఉంటుంది. దానికి గాలి తగలగానే రంధ్రం పడిన ప్రదేశంలో గట్టిగా అయిపోయి ఆ లిక్విడ్ ఆ రంధ్రాన్ని పూడ్చేస్తుంది. గాలి చాలా నిదానంగా వస్తుంది. ప్రమాదాలు కూడా జరగవు. టైర్లు కూడా సుళువుగా ఉంటాయి. దీంతో ఇంజన్ పైన తక్కువ ప్రభావం ఉంటుంది... మైలేజ్ బాగా వస్తుంది. 
 
ట్యూబ్‌లెస్ టైర్లను రిమ్ములోకి అమర్చడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే టైరుకు, రిమ్ముకు మధ్య సీల్ ఉంటుంది. ఈ టైర్‌ను సాధారణంగా మనం బిగించుకోవడం కష్టం. అనువజ్ఞులు మాత్రమే ఫిట్ చేయగలరు. సాధారణ టైర్ల కన్నా ట్యూబ్‌లెస్ టైర్ల వల్ల ప్రమాదాలు చాలా తక్కువ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేఈ చర్యలు