Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పాలన భేష్ .. తితిదే ఈఓను పొగడ్తలతో ముంచెత్తిన శ్రీవారి భక్తులు

Advertiesment
ttd eo sambasiva rao
, శుక్రవారం, 6 మే 2016 (12:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పాలన భేషంటూ శ్రీవారి భక్తులు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలోని డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో 20మంది భక్తులు ఫోన్ల ద్వారా తమ సమస్యలు తెలుపగా అందులో 10 మందికి పైగా భక్తులు తితిదే ఈఓ సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. 
 
తితిదే ఈఓగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఎన్ని వేల మంది భక్తులు తిరుమలలో ఉన్నా వారికి త్వరితగతిన దర్శనభాగ్యం లభిస్తోందని, దీనికంతటికి మీ పరిపాలనే కారణమంటూ కితాబిచ్చారు. రూ.300 ఆన్‌‌లైన్‌ టికెట్లకు కొత్త క్యూలైన్లను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పొగడుతుంటే తితిదే ఈఓ మాత్రం చిరునవ్వుతోనే వారికి సమాధానాలిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దటీజ్ జయలలిత... మేనిఫెస్టోతో సోనియా - కరుణానిధికి షాక్