Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగు పోతుంటే ఎన్నో మొరుగుతాయి.. టీ కాంగ్రెస్ నేతల తీరంతే... : తలసాని

Advertiesment
ఏనుగు పోతుంటే ఎన్నో మొరుగుతాయి.. టీ కాంగ్రెస్ నేతల తీరంతే... : తలసాని
, సోమవారం, 1 జులై 2019 (16:07 IST)
తెలంగాణ సచివాలయం వచ్చిన కాంగ్రెస్ వాళ్లు అరగంట కూడా లేరు. వచ్చి ఏం చూసారో నాకు అర్థం కాలేదు. ఏదో టైం పాస్‌కి వచ్చి టీవీలో పేపర్‌లో కనపడాలని ఇష్టం వచ్చినట్లు గురుకులాలకు, ఇంకాదేనికైనా ఇవ్వాలని చెప్తున్నారు. బయటి రాష్ట్రాల్లో ఉన్న విధంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ ఉండాలని సీఎం ఆలోచన దీనిపై కాంగ్రెస్ నేతల ముల్లె ఏం పోయిందో అర్థం కావడం లేదు. ఇరుకు ఇరుకుగా ఉన్న రహదారుల ఉన్నాయి. అందుకే కొత్త సచివాలయం కడుతున్నాం. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, గురుకులాలు నిర్మిస్తున్నాం. కల్యాణ లక్ష్మీ, ఇంటింటికి నల్ల నీళ్లు గొప్ప పథకాలు అందిస్తున్నాం. వీళ్ళ మొహాలకు ఎన్నడూ ఒక ఆలోచన చేయలేదు. వీరి ప్రతి పనీ అడ్డుకోవడమే. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక కేసులు వేశారు. ఎవరెన్ని చెప్పిన ఆరు నూరైన సచివాలయ నిర్మాణ చేసి తీరుతాం. లక్ష ఉద్యోగాలు విడతల వారిగా ఇస్తున్నాం. సెక్రటేరియట్‌కి టైమ్ పాస్ కోసం, పబ్లిసిటీ కోసం ఫోటోలు దిగారు తప్ప, విహార యాత్రకు వచ్చినట్టు వచ్చారు.
 
ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు రాజకీయ ఉద్యోగాలు తీసుకున్నారు తప్ప... ఇరిగేషన్ ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏ పండగకైనా ఒక్క రూపాయి కేటాయించారా? ప్రజలు పడుతున్న ఇబ్బందులు పోగొట్టాలని మా ప్రయత్నం. పల్లీలు అమ్ముకునే వాళ్ళలాగా టైం పాస్ కోసం వచ్చి వెళ్లారు. వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా నది నడిచిందో అలా నడపాలని చూస్తున్నారు.

మేము అలా నడపం. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నాకు ప్రెసిడెంట్ వద్దని పారిపోతున్నారు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు గ్రూపు తగాదాలతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోతున్నారు. జనం మధ్య‌కు వెళ్లలేని కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రతి పక్ష హోదాలో దళితుడు ఉండకూడదని ఉన్న ఎమ్మెల్యేలు పోయిన పట్టించుకోలేదు. దశల వారిగా డబల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తున్నాం. 
 
మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో భూములు పంచుతున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయలపై నేను మాట్లాడను. ఏనుగు వెళ్లేటప్పుడు ఎన్నో మొరుగుతాయి పట్టించుకుంటామా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం : గౌతం సవాంగ్