Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా కాంగ్రెస్‌లో పీసీసీ లొల్లి... హస్తినకు క్యూకట్టిన నేతలు!

తెలంగాణా కాంగ్రెస్‌లో పీసీసీ లొల్లి... హస్తినకు క్యూకట్టిన నేతలు!
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:35 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీలీ లొల్లి ఏర్పడింది. ఇటవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసి కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
 
ఈ క్రమంలో రాష్ట్ర పీసీసీ పదవికి రాజీనామా చేశాక కాంగ్రెస్ పార్టీలో ఆ పోస్టుకు ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. పీసీసీ రేసులో నేను ముందున్న అంటే నేను ముందున్న అని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఢిల్లీ అధినాయకత్వం ముందు ఎవరి పేరును సూచించారో తెలిక సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగెస్ లీడర్లు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినకు వెళ్లేవారిలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నట్లు సమాచారం. వీరంతా పీసీసీ పీఠంపై ఏకపక్ష నిర్ణయంతో అధినాయకత్వాన్ని కలవనున్నారు. 
 
తమలో ఎవరికీ పీసీసీ పదవి కట్టబెట్టిన సమ్మతమే కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని సీనియర్ లీడర్లు గరం అవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డికి మాత్రం పీసీసీ చీఫ్ ఇవ్వొద్దన్నది వారు పరోక్షంగా తెలియజేయనున్నారు. ఈయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి.. ప్రస్తుతం టీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మహిళ హత్యకు దారితీసిన 'సరదా మాట'... ఏంటది?