దేశ వ్యాప్తంగా టమోటా ధర రికార్డు స్థాయికి చేరింది. విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని రకాల కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో ఇతర కూరగాయల కంటే టమోటా ధర పెట్రోల్ రేటును దాటిపోయింది. అనేక ప్రాంతాల్లో కిలో టమోటా ధ రూ.130 నుంచి రూ.150 వరకు పలికింది.
అయితే, ఇతర ప్రాంతాల్లో టమోటా ధర ఎలా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లా మార్కెట్‌లో మాత్రం దీని ధర ఒక్కసారిగా పడిపోయింది. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో టమోటా ధర రూ.20కి పడిపోయింది. 30 కేజీల టమోటా పెట్టె ధర రూ.600గా పలికింది. రెండు రోజుల క్రితం ఇదే మార్కెట్‌లో 30 కేజీల టమోటా ధర ఏకంగా రూ.3 వేల వరకు రికార్డు స్థాయి ధర పలికింది.
ఇపుడు కేవలం 600 రూపాయలు మాత్రమే పలుకుతోంది. దీనికి కారణం మార్కెట్‌కు వచ్చే టమోటా లారీల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. స్థానికంగా కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ మార్కెట్‌కు టమోటా లోడులతో వచ్చే లారీ సంఖ్య అధికంగా వుంది. దీంతో ఈ ధర ఒక్కసారిగా పడిపోయింది.