తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భేటీకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇందులో 2022-23 సంవత్సరానికిగాను రూపొందించిన బడ్జెట్‌కు ఆమోదిస్తారు.
ఆ తర్వాత సోమవారం ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెడతారు. అయితే, ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై శాసనసభా వ్యవహారాల కమిటి (బీఏసీ)లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, ఈ దఫా బడ్జెట్ సమావేశాలు తొలి రోజున గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభంకానున్నాయి. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. దీనిపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు.