Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదీవద్దూ.. ఇదీవద్దూ... తిరుపతిని రాజధానిని చేయండి : చింతా మోహన్

అదీవద్దూ.. ఇదీవద్దూ... తిరుపతిని రాజధానిని చేయండి : చింతా మోహన్
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:17 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేసిన పునాదిరాయి అనాథగా మిగిలిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. పైగా, అమరావతి వద్దూ.. వైజాగ్ వద్దూ... తిరుపతిని రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ప్రధాని వేసిన పునాది రాయి అనాథగా మిగిలిందన్నారు. పైగా, కేంద్రంలో ఆయన పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నల్లధనానికి కేరాఫ్ చిరునామాగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పతనావస్థకు చేరిందని జోస్యం చెప్పారు. దుగ్గరాజపట్న ఓడరేవు రాకుండా అడ్డుకున్నది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. 
 
ఏర్పేడు - రావూరుల మధ్య దాదాపు 1.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూములతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 
 
కండలేరు, సోమశిల జలాశయాలు దగ్గర్లోనే ఉన్నాయనీ, తిరుపతికి ఏడు జాతీయ రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉందని, ఇంతకంటే రాజధాని నిర్మాణానికి ఏం కావాలని చింతా మోహన్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో జనగామ బాలుడు మృతి.. మద్యంమత్తులో మహిళ వీరంగం