Tirupati Girl Says Apology For Doing Reels At Alipiri ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే అలిపిరి మార్గంలో ఓ యువతి రీల్ చేసింది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రంలోని కిస్సిక్ పాటకు ఆమె తన స్నేహితుడుతో కలిసి డ్యాన్స్ చేస్తూ రీల్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇది వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు దిగివచ్చింది.
అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ చేయడమేమిటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని భక్తులు టీటీడీ కోరారు. భక్తులు నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం ఆ యువతిపై కేసు నమోదు చేసింది.
దీంతో ఆ యువతి దిగివచ్చి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. ఏదో తెలిసో.. తెలియకో తప్పు చేశానని, ఏదో అక్కడే క్లైమేట్ బాగుందని, ఆ రీల్ కూడా ట్రెండింగ్‌లో ఉంది కదా అని అనుకోకుండా అక్కడ డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోసారి ఇలాంటి తప్పు చేయనని తెలిపింది. దయచేసి తన తప్పును ఈసారికి క్షమించాలి, ఇంకెపుడూ ఇలా చేయనని తెలిపింది. తను చూసి అలా చేయాలని ఎవరైనా భావిస్తే అలాంటి తప్పులు చేయొద్దని విజ్ఞప్తి చేసింది.