Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజుల్లో డేటింగ్‌లు కామనే... పెళ్లి మాత్రం చేసుకోను.. గతాన్ని పీడకలలా మరచిపో...

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని నమ్మిన ఒక యువతి దారుణంగా మోసపోయింది. అతని మాయమాటలకు నమ్మి... తొందరపడి సర్వం సమర్పించుకుంది. తీరా పెళ్లి మాటెత్తగానే ఆ కామాంధుడు.. ఈ రోజుల్లో డేటింగ్‌లు సహజమే.. గ

ఈ రోజుల్లో డేటింగ్‌లు కామనే... పెళ్లి మాత్రం చేసుకోను.. గతాన్ని పీడకలలా మరచిపో...
, మంగళవారం, 11 జులై 2017 (12:17 IST)
ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని నమ్మిన ఒక యువతి దారుణంగా మోసపోయింది. అతని మాయమాటలకు నమ్మి... తొందరపడి సర్వం సమర్పించుకుంది. తీరా పెళ్లి మాటెత్తగానే ఆ కామాంధుడు.. ఈ రోజుల్లో డేటింగ్‌లు సహజమే.. గతాన్ని మరచిపో.. పెళ్లి మాత్రం చేసుకోను.. ఏమైనా చేసుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ యువతి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తిరుపతిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడపజిల్లాకు చెందిన ఓ యువకుడు అగ్రికల్చర్‌ కళాశాలలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈయనకు ఫేస్‌బుక్‌లో ఎంబీఏ చదువుతున్న ఈ యువతితో పరిచయమైంది. ఈ పరిచయం గంటల కొద్దీ మాట్లాడుకునేదాకా వచ్చింది. తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామన్న అబ్బాయి మాటలు నమ్మింది. డేటింగ్‌ల పేరుతో సర్వం సమర్పించుకుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వద్దంది. అతడు కూడా అమ్మాయి పెద్దలను కలిసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇలా నాలుగున్నరేళ్లు గడిచి పోయాయి. ఇద్దరూ ఓ శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకుని గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లారితే పెళ్లి.. ముందు రోజు రాత్రి నుంచే పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు. అతడి స్నేహితులనూ విచారించింది. ఆచూకీ లభ్యం కాలేదు.
 
రెండు రోజుల తర్వాత ఆ అబ్బాయి నుంచి ఫోన్ వచ్చింది. కానీ మాట్లాడింది మాత్రం అబ్బాయి తండ్రి. 'ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణమే. అన్నీ మర్చిపో' అంటూ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అబ్బాయి ఫోను తీసుకుని... ‘నువ్వు ఏమైనా చేయి. పెళ్లిమాత్రం చేసుకోను. జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఏమౌతుందీ.. 15రోజుల్లో బెయిల్‌ వచ్చేస్తుంది’ అని చెప్పాడు. దీంతో ఆమె ఖంగుతింది. తిరుపతి మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర్‌నాథ్ యాత్రికులపై దాడి.. లష్కరే తోయిబా పనే.. కాశ్మీర్ ఐజీ