Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్ డౌన్ తర్వాత ఒక్కరోజే శ్రీవారికి రూ.3.15 కోట్ల ఆదాయం

లాక్ డౌన్ తర్వాత ఒక్కరోజే శ్రీవారికి రూ.3.15 కోట్ల ఆదాయం
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (11:24 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. దీంతో తిరుమల ఆదాయం పెరిగింది. కరోనా తర్వాత శ్రీవారి ఆదాయం పెరిగింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. 
 
మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
 
కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. 
 
టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఈవో బసంత్ కుమార్‌పై బదిలీ వేటు.. ఎందుకంటే..