శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాములతో పాటు ఆలయ పెద్దజీయంగార్లకు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇప్పటికే అర్చకులు కోలుకుని త్వరలోనే స్వామి వారి సేవలో పాల్గొననునున్నారు. ఇక పెద్ద జీయంగార్లను చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా సాధారణ వుంది.
కరోనాను జయించిన జియ్యంగార్లు తిరుమల మఠానికి ఆగస్ట్ 1న రానున్నారు. ఇక తిరుమల శ్రీవారి సమాచారం చూస్తే... గురువారం శ్రీవారిని 6278 మంది భక్తులు దర్శించుకోగా తలనీలాలు 2248 మంది సమర్పించారు. హుండీ ఆదాయం 52 లక్షలు. నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఇవాళ పవిత్ర ప్రతిష్ట, రేపు పవిత్ర సమర్పణ ఎల్లుండి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఇక ఆన్లైన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవం సేవను నిర్వహించేందుకు ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్లో టిక్కెట్లును కోనుగోలు చేసిన భక్తులు ఆన్లైన్‌లో సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది.
అంతేకాదు కళ్యాణం లడ్డూ, వడ, వస్త్రాలను కొరియర్ ద్వారా భక్తులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కారణంగా శ్రీవారి కళ్యాణోత్సవం సేవను రద్దు చేసింది టిటిడి.