వేసవి శెలవులు కావడంతో కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ శనివారం నాటికి వేల సంఖ్యలో భారీగా భక్తులు బారులు తీరారు. దీనితో శనివారం నాడు తితిదే ఓ విజ్ఞప్తి చేసింది.
శనివారం సాయంత్రానికే సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు విన్నపం చేసారు. ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం భక్తుల దర్శనానికి కనీసం 48 గంటల సమయం పడుతుందనీ, అందువల్ల తిరుమల శ్రీవేంకటేశుని దర్శనభాగ్యం కోసం కాస్త ఆగి రావాలని విజ్ఞప్తి చేసారు.
ప్రస్తుతం తిరుమల చేరుకున్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామనీ, వీరికితోడుగా మరింతమంది భక్తులు వస్తే సౌకర్యాలను కల్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందన్నారు. అందువల్ల కొద్దిరోజులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తెలిపారు.