Publish Date: Tue, 23 Jun 2026 (13:47 IST)
Updated Date: Tue, 23 Jun 2026 (13:52 IST)
పోలవరం ప్రాంతం ఏలూరులో పెద్ద పులి సంచారంతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిలో చేపల వేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఎవరూ కూడా నది పరివాహక ప్రాంతాలలో చేపల వేటకు గాని పశువుల మేతకు తీసుకువెళ్లకూడదని వెళ్ళకూడదనీ, రైతులు, గ్రామస్తులు, పొలాలు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోనులను సిద్ధం చేశారు.
పోలవరం మండలంలోని తెల్లదిబ్బలు ప్రాంతానికి సమీపంలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, కాకిస్నూర్, టేకుపల్లి, కోయిదా, గుల్లమడుగు, టేకూరు, సిద్ధారం గ్రామాల ప్రజలు రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, పశువులను అడవిలోనికి మేతకు తీసుకువెళ్లకూడదని, పశువుల కొట్టం నందు లైటింగ్ ఏర్పాటు చేసుకుని పశువులను ఇళ్ల వద్దే భద్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు.