Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనను తన్ని రోడ్డున పడేశారు.. పిచ్చికుక్కతో సమానంగా చూశారు.. వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

Advertiesment
undavalli sridevi
, ఆదివారం, 26 మార్చి 2023 (21:26 IST)
నిండు అసెంబ్లీ సాక్షిగా గుండెకు ప్రాణం అంటూ ఉండే అది కూడా జగన్ జగన్ జగన్ అంటూ కొట్టుకుంటుందంటూ వ్యాఖ్యానించిన తాడేపల్లి వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైకాపా అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన్ని నడి రోడ్డు పడేశారన్నారు. తనను పిచ్చికుక్కతో సమానంగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
డాక్టర్ సుధారక్, డాక్టర్ అచ్నన్నలాగా డాక్టర్ శ్రీదేవి కూడా చనిపోకూడదన్న ఉద్దేశంతోనే కొన్ని రోజులు బయటక కనిపించలేదని వివరించారు. అయితే, తాను హైదరాబాద్ నగరంలోనే ఉన్నానని చెప్పారు. అదేమీ సహారా ఎడారి కాదన్నారు. తాను సమాజంలో బాధ్యతగల వైద్యురాలిని అని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని టాప్-10 వైద్యుల్లో తన పేరు ఉంటుందని చెప్పారు. వైద్యురాలిగా తన సేవలను గుర్తించే తాడేపల్లిలో వైకాపా తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి తాను డబ్బులు తీసుకున్నానని, పార్టీకి వ్యతిరేకంగా ఓటేశాననే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆఫీసుపై వైకాపా గూండాలు దాడి చేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. తన ఆఫీసులోనే స్వేచ్ఛగా కూర్చొనే వీలు లేకుండా పోయిందని మండిపడ్డారు. 
 
ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమె స్పందిస్తూ, ఎమ్మెల్సీకి జీతం లక్ష లేదా లక్షన్నర వస్తుంది. ఇంతదానికి రూ.కోట్లలో డబ్బులు ఎవరు ఇస్తారని తెలిపారు. తాను ఓవరికి ఓటు వేశానో తనపై  ఆరోపణలు చేస్తున్న వారికి ఎలా తెలుసని ఆమె ప్రశ్నించారు. తన కోసం స్పెషల్‌గా పోలింగ్ బూత్‌లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. రహస్యంగా జరిగే ఓటింగ్‌లో ఎవరు ఎవరికి ఓటు వేశారో ఎలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంతింటికే కన్నం వేసిన ఘనులు.. ఆ తర్వాత కారం చల్లి...