Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది రైతు దగా దినోత్స‌వం, తెలుగుదేశం నిర‌స‌న‌!!

Advertiesment
farmer's deception day
, గురువారం, 8 జులై 2021 (14:46 IST)
స్వ‌ర్గీయ వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతిని ఒక ప‌క్క ఏపీ ప్ర‌భుత్వం రైతు దినోత్స‌వంగా జ‌రుపుతుంటే, మ‌రో ప‌క్క ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం దీన్ని రైతు ద‌గా దినోత్స‌వంగా అభివ‌ర్ణిస్తోంది. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లు తెలుపుతోంది.

విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఇందులో దేవినేని మాట్లాడుతూ, మిల్లర్ల దయా దక్షిణ్యాలు మీద రైతును గాలికి వదిలేశారు... మా డబ్బులు తీసుకెళ్లి రైతు భరోసా కాంట్రాక్టర్లుకు డబ్బులు ఇచ్చారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వమో అర్ధమవుతుంద‌న్నారు. నారుమళ్లకు నీళ్లు ఇచ్చే సమయంలో మీరు ఏ విధంగా సముద్రంలో కి నీళ్లు వదులుతార‌ని ప్ర‌శ్నించారు? ప్రధానమంత్రి కి రాసే ఉత్తరంలో ఇవ్వనీ ఎందుకు రాయడు ?
 
కే ఆర్ ఎం బీ ఆఫీస్ తీసుకెళ్లి విశాఖ లో పెట్టాడు. ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు! ఆన్ లైన్ ధాన్యం డబ్బులు ఎంత రావాలి అని సమాచారం ఉండేది అది మూసేసారు. ఈ బూతుల‌ మంత్రి ఏమి చేస్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి కొడాలి నాని అసలు నోరు తెరవడం లేదు... వీళ్లకు చేతనైనది ఏమిటి అంటే.. చంద్రబాబుని, లోకేష్ ని  తిట్టడం అని ఆరోపించారు. తాడేపల్లి రాజాప్రసాదంలో కూర్చొని పబ్జి ఆడుకుంటూ... కృష్ణ నీళ్లు నికర జలాలు సముద్రం పాలు చేస్తున్నావు జగన్ రెడ్డి అని దుయ్య‌బ‌ట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊపిరి పీల్చుకున్న జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా