Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. 17న పోలింగ్.. అన్నీ ఏర్పాట్లు పూర్తి

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. 17న పోలింగ్.. అన్నీ ఏర్పాట్లు పూర్తి
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (22:49 IST)
మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. 
 
మూడో విడత ఎన్నికల కోసం రాష్ట్రంలో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను వర్గీకరించి, వాటికి అదనపు భద్రత కల్పించారు. 
 
13 జిల్లాల్లో 2,640 పంచాయతీలకు పోలింగ్
26,851 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఏజెన్సీ ప్రాంతాల్లో 1.30 గంటలకే పోలింగ్ ముగింపు
ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కంట్రోల్ సెంటర్లు
 
ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు అయిపోయాయి. ఇక మూడో దశ ఫిబ్రవరి 17న జరగనుంది. నాలుగోదశ ఫిబ్రవరి 21న జరగనుంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతాయని ప్రకటించారు. 
 
మార్చి 10న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్‌గా కిరణ్ బేడీ తొలగింపు.. ఆమె స్థానంలో తమిళిసై.. పుదుచ్చేరి రాజకీయాల్లో..?