Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడుకు ప్రధాని మోడీ వరాలు .. మెట్రో రైల్ సేవలు పొండగింపు

Advertiesment
తమిళనాడుకు ప్రధాని మోడీ వరాలు .. మెట్రో రైల్ సేవలు పొండగింపు
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (14:50 IST)
మరికొద్ది రోజుల్లో తమిళనాడు శాసనసభకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, పూర్తి చేసిన అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులోఒకటి చెన్నై మెట్రో రైల్ సేవలను పొడగించారు. స్థానిక వాషర్‌మెన్ పేట నుంచి వింకో నగర్ వరకు మెట్రో రైల్ సేవలను పొడంగించారు. 
 
చెన్నైలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యల ఉత్పత్తిని సాధించారని తమిళనాడు రైతులను అభినందించారు. జల వనరులను సమర్థంగా వినియోగించుకుని ఇక్కడి రైతులు భారీ దిగుబడులను రాబట్టారన్నారు. నీటిని సంరక్షించేందుకు మనం శక్తివంచన లేకుండా పనిచేయాలని, ప్రతి నీటి చుక్కనూ మరింత దిగుబడికి అనువుగా మలుచుకోవాలనే నినాదంతో ముందుకెళ్లాలని కోరారు.
 
చెన్నై మెట్రో రైల్‌ విస్తరణతో పాటు పలు మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చారు. మెట్రో రైల్‌ మలిదశలో 9 కిలోమీటర్ల లైన్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 మహమ్మారి వెంటాడినా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిచేశారని అన్నారు. 
 
చెన్నై మెట్రో వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది బడ్జెట్‌లో మెట్రో రెండో దశకు రూ 63,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏ నగరంలోని ప్రాజెక్టుకైనా ఈ స్ధాయిలో భారీ నిధులు కేటాయించడం ఇదే తొలిసారని చెప్పారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రముఖ తమిళ రచయిత సుబ్రహ్మణ్యం భారతి చెప్పిన కొన్ని మాటాలను ఆయన గుర్తు చేశారు. 'మనం ఆయుధాలు తయారు చేద్దాం.. కాగితాలు తయారు చేద్దాం.. కర్మాగారాలు నిర్మిద్దాం.. పాఠశాలలను నెలకొల్పుదాం.. వాహనాలను రూపొందిద్దాం.. ఓడలను తయారుచేద్దాం' అన్న మాటలను గుర్తు చేశారు. ఆయన చెప్పిన మాటల స్ఫూర్తిగా ఈ రోజు దేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను, స్వావలంబనను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు.
 
దేశంలోని రెండు రక్షణ కారిడార్లలో ఒకటి తమిళనాడులోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆ కారిడార్ కు రూ.8,100 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. మన సైనిక బలగాలను ప్రపంచంలోనే అత్యంత అధునాత బలగాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను వేగంగా సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
 
మన సైనికులు దేశ విలువలతో పాటు ధీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోడీ కొనియాడారు. సమయం వచ్చినప్పుడల్లా మాతృభూమిని కాపాడడంలో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారన్నారు. శాంతి సామరస్యాలను నమ్ముతూనే.. మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్నారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రకోటలో హింస : గ్రెటా టూల్ కిట్ కేసులో బెంగళూరు యువతి అరెస్ట్