Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపిలో ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే..

Advertiesment
ఏపిలో ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే..
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:23 IST)
మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరుగనున్నాయి. రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 140 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రీ-నోటిఫికేషన్‌ జారీ చేశారు. వివిధ కారణాల వల్ల 4 నగరపాలక  సంస్థలు, 29 పురపాలక/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. 
 
ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే..
 
శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ
 
విజయనగరం జిల్లా: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల
 
విశాఖపట్నం జిల్లా: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి
 
తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, యేలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం
 
పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం
 
కృష్ణాజిల్లా: విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు
 
గుంటూరు జిల్లా: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల
 
ప్రకాశం జిల్లా: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు,చీరాల
 
నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట
 
అనంతపురం జిల్లా: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, హిందూపూర్, గుంతకల్లు, తాడిపజ్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర
 
కర్నూలు జిల్లా: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడురు, ఆళ్లగళ్ల, ఆత్మకూరు
 
కడప జిల్లా: కడప మున్సిపల్ కార్పొరేషన్, ప్రొద్దటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదకూరు, యర్రగుంట్ల
 
చిత్తూరు జిల్లా: తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

దీంతో ప్రభుత్వ పథకాలు, పార్టీల పోస్టర్లు, విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందిగా ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇవాళ్టి నుంచి మార్చి 15 వరకు కోడ్ అమల్లో ఉండనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గినియాలో ఎబోలా వైరస్‌