Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో నెల రోజులలో వేదవిద్యా తరగతులు: ధర్మారెడ్డి

Advertiesment
మరో నెల రోజులలో వేదవిద్యా తరగతులు: ధర్మారెడ్డి
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:43 IST)
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి గురువారం వేద పాఠశాల ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమంలో అదనపు ఈఓ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ.. అధ్యాపకులు వేదవిద్యా బోధనలో భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలని, విద్యార్థులను ప్రతిభావంతమైన వేదపండితులుగా తయారు చేయాలని అన్నారు. అందుకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తామని చెప్పారు.

మరో నెల రోజులలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో బయటి వ్యక్తులు  ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. అటవీ ప్రాంతం కావడంతో టీటీడీ, ఉద్యానవన విభాగాలు కలిసి ఫెన్సింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

మురుగునీరు నిల్వ ఉండకుండా మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వేద పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఈవో విజయసారథి దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
 
ఈ సమావేశంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వర రావు, ఈఈ  జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఎంఎస్ ఈఈ మల్లికార్జున ప్రసాద్, డిఈ సరస్వతి, విజివో మనోహర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్ఓ చంద్రశేఖర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్‌ లాక్కుంటారా? చుక్కలు చూపించిన 17 ఏళ్ల బాలిక.. బేటీ బచావొ, బేటీ పడావోకు..?