Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ

Advertiesment
రాబోయే 3 నెలల్లో రూ.986 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం: ఏపీ పన్నుల శాఖ
, శనివారం, 3 అక్టోబరు 2020 (09:29 IST)
రాబోయే 3 నెలల కాలంలో రూ.986 కోట్ల మేర పన్నులు, బకాయిలు వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్  నెలలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడానికి శనివారంలోగా ప్రణాళికలు అందజేయాలని ఏపీ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్  పియూష్ కుమార్ ఆదేశించారు.

ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజూ డివిజన్, సర్కిల్ వారీగా మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. బోగస్ డీలర్లు, వ్యాపారులు, బిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సరైన సమయంలో అటువంటివారిపై దాడులకు దిగుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

పన్నుల వసూలు సమయంలో సక్రమంగా పన్నులు చెల్లించేవారు, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వబోమన్నారు. ఇదే విషయమై తమ శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు.

నిర్ధేశించిన రూ.986 కోట్ల వసూలుకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్లు, ఇతర అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఆ ప్రకటనలో చీఫ్ కమిషనర్ పియూష్ కుమార్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ను జాతిపితతో పోల్చడం సిగ్గుచేటు: నాదెండ్ల బ్రహ్మం