Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

Advertiesment
అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్
, శనివారం, 21 నవంబరు 2020 (07:03 IST)
అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయిందని, మొహమాట యుద్ధం కాంగ్రెస్ చరిత్రలో లేదని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ పేర్కొన్నారు.

అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజధాని ఉద్దండరాయుడు పాలెంలో జరిగిన సదస్సులో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు.కాంగ్రెస్ మొదటినుంచి ఓకే రాష్ట్రం..ఓ కే రాజధాని మాటమీదే కట్టుబడి ఉందన్నారు.

ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఏలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని నిలదీశారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ప్రజలతొ కలిసి అడ్డుకుంటుందన్నారు.ప్రజలను పట్టించు కోని సీఎం,మంత్రులు,ఎమ్మెల్యేలు ఇక్కడికి ఎలా వస్తారన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి పేరు మీద జరుగుతూ ఉన్న దుర్మార్గమైన నాటకాన్ని చూస్తుంటే కడుపు తరుక్కు పోతోందన్నారు. ఇక్కడికి వచ్చిన అమ్మలందరికీ వాగ్దానం చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటుందన్నారు.

ఇక్కడి ప్రజలు, రైతులు 300  రోజులకు పైగాఅరచి..అరచి ఒపిక నశించింది...వారిని నకిలీలు అన్నారు,పనిలేక రోడ్డు మీదకు వచ్చారన్నారు,లాఠీలతొ కొట్టించారు,సంకెళ్లు వేశారు..అమ్మలను దూషించారు అన్నారు.అమరావతి సంబంధించి జగన్ తప్పులు ఇంకా 100 పూర్తి కాలేదన్నారు.

జగన్ రాజశేఖరరెడ్డి గూర్చి మానాయన...అంటూ ఉంటారు..కాని ఆయనకు తండ్రి ఇంటిపేరు మాత్రమే వచ్చింది...వంటి లక్షణంరాలేదన్నారు.వైఎస్ మాట ఇస్తే ప్రాణం పొయినాతప్పరన్నారు.

రాజధానిపై జగవి మాటతప్పారన్నారు. పవన్కళ్యాణ్ బీజేపీ భజన మాని...రాజధానిపై స్పష్టంగా ప్రకటన చేయాలన్నారు. రాజధాని ప్రజలతో 3 రొజులు గడిపితే వారి ఆవేదన అర్ధమవుతుందన్నారు.
 
ప్రధాని మొదీ,బీజేపీ నాయకులు ధైర్యంగా పార్లమెంట్లో అమరావతిపై మాకు ఏలాంటి ఆలోచన లేదని చెప్పగలరా అని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డకు ఢిల్లీ పిలుపు?