Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లిపై అత్యాచారం చేస్తుంటే భద్రకాళిగా మారిన అక్క, కొడవలితో ఒక్క వేటు, అంతే తెగి కిందపడింది

Advertiesment
చెల్లిపై అత్యాచారం చేస్తుంటే భద్రకాళిగా మారిన అక్క, కొడవలితో ఒక్క వేటు, అంతే తెగి కిందపడింది
, సోమవారం, 5 అక్టోబరు 2020 (19:15 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం తిరుమలరెడ్డి పల్లెలో ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది.
 
గ్రామానికి చెందిన రెడ్డెప్పకు నలుగురు పిల్లలు. చిన్న కూతురైన మైనర్ బాలిక (15) తన అక్క పావనితో కలిసి గొర్రెలు మేపడానికి సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లేది. రోజులానే శనివారం కూడా గొర్రెలను మేపడానికి రెడ్డివారి కుదవ ప్రాంతానికి అక్క చెల్లెళ్ళు వెళ్లారు.
 
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆర్ శంకరప్ప(40) మైనర్ బాలికను పక్కనున్న పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక అరుపులు వేస్తూ తప్పించుకొవాడానికి ప్రయత్నించింది. శంకరప్ప వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీంతో తన చేతిలో ఉన్న కొడవలితో అతడి చేతిపై దాడి చేసింది. దాంతో అతడి చేయి తెగింది. అతడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
శంకరప్ప గత కొన్నేళ్లుగా తనను రేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కోంది. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి శంకరప్పను అదుపులోకి తీసుకున్నారు. శంకరప్పను బాలిక తల్లిదండ్రులు అనేకసార్లు హెచ్చరించారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హేమంత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. బంగారు గొలుసు, ఉంగరం స్వాధీనం..