Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ లో తొలి ఆటిజం సెంటర్

Advertiesment
ఆంధ్రప్రదేశ్ లో తొలి ఆటిజం సెంటర్
, మంగళవారం, 30 మార్చి 2021 (08:52 IST)
పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్లో తన తొలి ఆటిజమ్ థెరపీ కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించింది. లబ్బీపేటలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో  ఆటిజం బాధిత చిన్నారులను వారి కాళ్లపై వారు నిలబడేలా, సమాజంలో ఇతరులతో సమానంగా జీవించగలిగేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన వనరులు, నిపుణులతో ఈ కేంద్రాన్ని స్థాపించిన  నిర్వాహకులను అభినందించారు 
 
మరో అతిధి డివిజన్ కార్పొరేటర్ రెహనా నహీద్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఈ పాఠశాల ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంది అన్నారు పిల్లలు మానసిక ఎదుగుదల లేకపోతే ఆ కుటుంబ లో పరిస్థితి ఎంతో వ్యధ బరితం అన్నారు ఇటువంటి పరిస్థితులు అధిగమించటానికి ఈ సంస్థ పనిచేస్తుంది అని తెలిసి సంతోషం కలిగింది అన్నారు.

ఆటిజం బాధితుల కోసం హెల్ప్లైన్ పినాకిల్ నెట్వర్క్.. ఆటిజం బాధితుల దేశవ్యాప్తంగా పనిచేసే నేషనల్ హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. 9100 181 181 అనే ఈ నంబర్కు పని చేసి ఆటిజం బాధిత చిన్నారుల సమస్యలను చెప్పి పరిష్కారం పొందవచ్చు.

అంతేకాదు వారికి స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ, బిహేవియరల్ థెరపీ, ప్రత్యేక విద్య వంటి అవసరాలు తీర్చేందుకు ఈ హెల్ప్లైన్  మార్గదర్శనం చేస్తుంది.
 
230కి పైగా దేశాల్లో నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 80 కోట్ల మందికి పైగా చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలే లక్ష్యంగా పినాకిల్ నెట్వర్క్ ఈ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తమ తొలి ఆటిజం థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ వ్యవస్థాపకురాలు, ముఖ్య వ్యూహకర్త డాక్టర్ శ్రీజారెడ్డి సరిపల్లి చెప్పారు. 

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆటిజం రుగ్మతను రూపుమాపడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు విజయవాడలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.  అత్యున్నత స్థాయి సౌకర్యాలు, ఉత్తమ క్లినికల్ కేర్ ఈ సెంటర్లో లభిస్తాయి. అంతేకాదు ఆటిజం చిన్నారులను ఎవరిమీదా ఆధారపడకుండా సొంతంగా అర్థవంతంగా జీవించగలిగేలా తయారు చేయాలన్న ఉత్తమ లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పామని శ్రీజా రెడ్డి ప్రకటించారు. 

ఈ కేంద్రంలో చిన్నారుల సంపూర్ణ అభివృద్ధికి కావలసిన అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ రకాల థెరపీలు, అత్యాధునిక చికిత్సా విధానాలు, వాటికి కావల్సిన పరికరాలతోపాటు పూర్తి సమయం సేవలందించే డాక్టర్లు, వివిధ రకాల థెరపిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. 
 
ప్రతి 60 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం బాధితులే 
ఆటిజం 104 ఏళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రుగ్మత దేశంలో శరవేగంగా విస్తరిస్తుండటం కలవరపెడుతోంది. 2020 నాటికి దేశంలోని ప్రతి 60 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం బాధితులేనని గణాంకాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్లుగా ఈ రుగ్మత పెరుగుతూ ఇప్పుడు అత్యంత సాధారణంగా వచ్చే రుగ్మతగా మారడం మరింత ఆందోళన కలిగిస్తోంది.  ఆటిజం బాధితులకు జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయకపోవడంతో వారు సమాజంలో తోటివారితో సమానంగా జీవించడం కష్టమవుతుంది. మందుల మీద, కుటుంబసభ్యుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. 
 
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో చికిత్స 
పినాకిల్ నెట్వర్క్ 2017లో స్థాపించబడింది. ఆటిజం బాధిత పిల్లల కోసం అన్ని రకాల సౌకర్యాలు, అత్యాధునిక చికిత్సా పద్ధతులతో కూడిన ఉత్తమశ్రేణి థెరపీ సెంటర్లను నిర్వహిస్తోంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ కేంద్రాల్లో   ఆటిజం బాధితులను నాడీపరంగా, మానసికంగా పరిపుష్టం చేసే 16 రకాల థెరపీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇవన్నీ మిరాకిల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇంజన్ సాయంతో నడుస్తాయి.  మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ మేళవించి పినాకిల్ సంస్థ ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇంజిన్ను రూపొందించింది.

దీంతో పిల్లలకు మెరుగైన  చికిత్స అందుతుంది.  ఈ చికిత్స పొందిన చిన్నారులు సొంతంగా, సమాజంలో మిగతావారితో సమానంగా జీవనం సాగించగలుగుతారని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ 100 శాతం ముఖ్యమంత్రి అభ్యర్థి: నాదెండ్ల మనోహర్