మంగళగిరికి వచ్చిన అఘోరీని తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని.. ఆ సమయంలో తమ కూతురుని ప్రలోభాలకు గురి చేసి తమకు దూరం చేసిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని రెండు నెలల క్రితం లేడీ అఘోరీ నాగసాధు ప్రలోభాలకు గురిచేసి ఎత్తుకుపోయినట్లు గతంలో ఆమె తల్లితండ్రులు ఆరోపించారు. శ్రీవర్షిణి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కానీ శ్రీవర్షిణి తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయినా పోలీసులు తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చెర నుంచి విడిపించారు.
అనంతరం మంగళగిరిలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బయలుదేరి వెళ్లారు. లేడీ అఘోరీ నుంచి శ్రీ వర్షిణిని తీసుకుని కుటుంబ సభ్యులు బయలుదేరారు. అయితే లేడీ అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ యువతి మొర పెట్టుకుంటున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.