ప్రకాశం జిల్లాలో ఉమ్మెత్తకాయలు తినడంతో కుటుంబం అస్వస్థత

శనివారం, 16 మే 2020 (16:38 IST)
ఉమ్మెత్తకాయలు తింటే కరోనా సోకదన్న అపోహతో ఒక కుటుంబం ఆస్పత్రి పాలైంది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఉమ్మెత్తకాయలు తింటే కరోనా దరిచేరదన్న అసత్య వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. దీంతో నిజమేనని నమ్మిన నలుగురు కుటుంబ సభ్యులు వాటిని తినడంతో అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వలసకూలీల బాధ్యత రాష్ట్రాలదే: కేంద్రం