Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

Advertiesment
cock race

ఐవీఆర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (15:35 IST)
కోడిపందేల దగ్గర జనసేన ఫ్లెక్సీలు పెట్టినందుకు జనసేన నేత ముప్పా గోపాలకృష్ణపై వేటు పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. 
 
ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందేల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరం. ఇందుకు బాధ్యుతలైన మిమ్మల్ని పార్టీ నుంచి  సస్పెండ్ చేస్తున్నాం అని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇకపై, జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎలాంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు పార్టీ స్పష్టం చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు రికార్డింగ్ డాన్స్‌లు కోడిపందేలు కేసినోలుతో రెచ్చిపోయారు కదా మరి వాళ్ళని కూడా సస్పెండ్ చెయ్యాలి అని కోరుతున్నారు జనసేన కార్యకర్తలు. దీనితో ఈ విషయం కాస్తా పార్టీ పెద్దల వరకూ చేరినట్లు సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలు