Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలు

Advertiesment
imran khan

ఠాగూర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (15:34 IST)
ఒక అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఆయన వివిధ కేసుల్లో జైలులో ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఓ కేసులో 14 యేళ్ళ జైలుశిక్ష పడింది. మరోవైపు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని జైలు నుంచి విడుదలయ్యేందుకు తానేమీ నవాజ్ షరీఫ్‌ను కాదన్నారు. ఎటువంటి వ్యూహాలు పన్నినా.. సైన్యంతో అంగీకారానికి వచ్చే ప్రసక్తే లేదన్నారు. 
 
తాను మాతృభూమి పాకిస్థాన్‌లోనే నివసించానని, ఇక్కడే కన్నుమూస్తానని మరోసారి స్పష్టం చేశారు. జైళ్లలో ఉన్న పీటీఐ పార్టీ కార్యకర్తల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయంటూ సైన్యం, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పీటీఐ పార్టీకి, సైనిక మద్దతుగల షెహబాజ్ షరీఫ్ సర్కారుకు మధ్య 'సయోధ్య' చర్చలు జరుగుతున్న వేళ ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు.
 
'పాకిస్థాన్‌లో రాజకీయ ఖైదీల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. సైనిక కస్టడీలో ఉన్న మా పార్టీ కార్యకర్తలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. నేను కూడా వేధింపులకు గురయ్యాను. మా పార్టీని అణచివేసే క్రమంలో మొత్తం వ్యవస్థనే ఉల్లంఘించారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ.. విచారణకు అనుమతి లభించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై గొంతు వినిపించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఉల్లంఘనల విషయంలో చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలకు లేఖలు రాస్తా' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. 
 
దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా మారిందన్నారు. విదేశీ పెట్టుబడులు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, ఇక్కడి కంపెనీలు దుబాయ్‌కు తరలిపోతున్నాయని ఆరోపించారు. వృద్ధి రేటు మందగించడంతో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. చట్టబద్ధ పాలన లేని దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఎప్పటికీ సాధించలేమని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్