Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వగ్రామాలకు పంపాలంటూ వలస కార్మికుల ఆందోళన

Advertiesment
స్వగ్రామాలకు పంపాలంటూ వలస కార్మికుల ఆందోళన
, శుక్రవారం, 8 మే 2020 (22:42 IST)
కరోనా లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊళ్లకు వెళ్లలేక 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన బాట పట్టారు.

శుక్రవారం మంగళగిరి రైల్ వె ఓవర్ బ్రిడ్జ్ పైకి  కార్మికులు  వందలాదిగా చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ మరియూ  స్థానిక పోలీస్ అధికారులు సమస్య పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని హామీ ఇచ్చారు.
 
అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలా వలస కూలీలు పెద్ద సంఖ్యలో చేరి నిరసన తెలపటమూ కోవిడ్ 19 వ్యాప్తికి ఆస్కారం ఏర్పడినట్లు అవుతుంది.

పరిస్థితి ని గమనించి త్వరితగతిన ఇతర జిల్లాలు,ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపేలా అధికారులు చర్యలు చేపట్టాలి.ఏదైనా ప్రమాదం జరిగాక ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ చేస్తే 24 గంటల్లో వైద్యం.. జగన్ తాజా ఆదేశం