Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోం మంత్రి వస్తుంటే.. మేం గ్రామం విడిచి వెళ్లిపోవాలా? టీడీపీ సర్పంచ్ ప్రశ్న

Advertiesment
taneti vanitha
, గురువారం, 5 అక్టోబరు 2023 (11:16 IST)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి ఏపీ హోం మంత్రి తానేటి వనిత వస్తున్నారని టీడీపీ గ్రామ సర్పంచ్‌ను గ్రామం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వ అధికారులు హుకుం జారీ చేశారు. దీనికి నిరసనగా ఆ గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యాలయం మెట్లపైనే కూర్చొని నిరసన తెలిపారు. 
 
'గ్రామ సర్పంచిగా నాకు గౌరవం ఇవ్వలేదు.. పైగా బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్‌ఐ అవమానకంగా మాట్లాడారు. హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లిపోవాలా' అని జిల్లాలోని కొవ్వూరు మండలం చిడిపి పంచాయతీ సర్పంచి, టీడీపీ నేత పాలడుగుల లక్ష్మణరావు ప్రశ్నించారు. 
 
గ్రామంలో బుధవారం జగన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, హోం మంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా వస్తున్నారని అధికారులు చెప్పడంతో శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేసి ఇంటికొచ్చామన్నారు. ఈలోగా పోలీసులొచ్చి తనతో పాటు మరో ఆరుగురిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
స్టేషనులో గ్రామీణ ఎస్ఐ సతీష్‌ అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టు చేయవచ్చని, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అదుపులోకి తీసుకొన్నారంటూ చొక్కా విప్పి స్టేషన్‌ వరండాలో మెట్లపై కూర్చుని లక్ష్మణరావు నిరసన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నారై జాక్ పాట్.. రూ. 33.99కోట్లు.. ఫోన్ తీయలేదు..