Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బడా నేతలకు హ్యాండిచ్చిన చంద్రబాబు.. తెనాలి నుంచి నాదెండ్ల

Advertiesment
Babu

సెల్వి

, శుక్రవారం, 15 మార్చి 2024 (18:38 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు సీట్లను మినహాయిస్తే 144 అసెంబ్లీ, 17ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఇప్పటికి రెండు జాబితాల్లో కలిపి 128 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 16 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఈసారి సీనియర్లకు, బడా నేతలకు చంద్రబాబు హ్యాండిచ్చారు. 
 
గుంటూరు జిల్లాలో సీనియర్ నేత అయిన ఆలపాటి రాజాకు ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా ఆయన ఆశించిన తెనాలి స్థానం జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత అయిన కళా వెంకట్రావు సీటు ఈసారి డైలమాలో ఉంది. కొవ్వూరు నుంచి టికెట్ ఆశించిన మాజీమంత్రి జవహర్‌కు సెకండ్ లిస్ట్‌లో షాక్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆయన స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావు అవకాశం కల్పించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని మాజీమంత్రి పీతల సుజాతకు టీడీపీ నాయకత్వం తొలి జాబితాలో షాక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఆమెకు కాకుండా రోషన్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చింది. 
 
అయితే టీడీపీ నాయకత్వానికి ఇప్పటికి కూడా పీతల సుజాత విధేయురాలిగానే కొనసాగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీమంత్రి దేవినేని ఉమకు కూడా సీటు దక్కలేదు. మైలవరం సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం కుంభకోణం: కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్