తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వైటీ నాయుడు మృతి చెందారు. ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైటీ నాయుడు తనకు అత్యంత ఆత్మీయుడు, చిరకాల మిత్రుడని, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తెలుగుదేశం పార్టీ కోసం వీరోచితంగా పోరాడిన వైటీ నాయుడి మరణం పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని కోల్పోయాం అని, 
 
									
										
								
																	
	ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. వైటీ నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.