Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీకి రావొచ్చు.. కూర్చోవాలంటే.. మంత్రి కావాల్సిందే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. లోకేశ్‌తో పాటు తెదేపా నుంచి బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, బ

ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీకి రావొచ్చు.. కూర్చోవాలంటే.. మంత్రి కావాల్సిందే..
, గురువారం, 30 మార్చి 2017 (10:41 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. లోకేశ్‌తో పాటు తెదేపా నుంచి బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, బీటెక్‌ రవి, పోతుల సునీత, దీపక్‌రెడ్డి, భాజపా నుంచి మాధవ్‌, పీడీఎఫ్‌ నుంచి కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 
 
ఇటీవల నారాలోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక నారాలోకేష్ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. కాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారంతో లోకేష్, అధికారికంగా ఎమ్మెల్సీ హోదాను దక్కించుకోగా, ప్రధానమైన శాసనసభలో వచ్చి కూర్చోవాలంటే మాత్రం, ఆయన మంత్రి పదవిని చేపట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన, మంత్రి అయితే, అసెంబ్లీలోకి రావచ్చు. కాగా, ఈ వారంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అందులో లోకేష్ కు ఓ బెర్తు ఖాయమని వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?