తెలుగుదేశం ఘనంగా నిర్వహించనున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు మొదలవుతున్నాయి. తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కమిటీలను ప్రకటించారు. ఒక ఉత్సవంలా మహానాడు నిర్వహించాలని వేదిక ప్రాంగణ ఏర్పాట్ల కమిటీ, సభా నిర్వహణ కమిటీ, భోజన, రిఫ్రెష్‌మెంట్, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు కమిటీ, తీర్మానాల కమిటీ, పత్రికా మీడియా సంబంధాలు, ఆర్ధిక వనరుల కమిటీలను వేశారు. పలువురు మంత్రులు, ముఖ్య నాయకులను ఆ కమిటీలకు బాధ్యులుగా వేశారు. కమిటీల వివరాలివి.
*తీర్మానాల కమిటీ
యనమల రామకృష్ణుడు - తీర్మానాల కమిటీ కన్వీనర్
రావుల చంద్రశేఖర్ రెడ్డి - తీర్మానాల కమిటీ కో కన్వీనర్
జి.మాల్యాద్రి - కో-ఆర్డినేటర్
అమర్నాథ్ బాబు - కోఆర్డినేటర్
*వేదిక/ప్రాంగణ ఏర్పాట్ల కమిటీ
పి.నారాయణ-కన్వీనర్
ఇ.పెద్దిరెడ్డి-కో.కన్వీనర్
*సభా నిర్వహణ కమిటీ
పయ్యావుల కేశవ్-కన్వీనర్
సీతక్క-కో.కన్వీనర్
*భోజన,రిఫ్రెష్ మెంట్,మంచినీరు,మజ్జిగ ఏర్పాటు కమిటీ
గల్లా అరుణ కుమారి
అరవింద కుమార్ గౌడ్
శంకర్ యాదవ్
*పత్రికా మీడియా సంబంధాల కమిటీ
గాలి ముద్దు కృష్ణమ నాయుడు-కన్వీనర్
బండారు సత్యనారాయణ మూర్తి
యల్.వి.యస్.ఆర్.కె.ప్రసాద్-కో.కన్వీనర్
ఎస్.నర్సిరెడ్డి
*ఆర్ధిక వనరుల కమిటీ
గరికపాటి మోహన్ రావు-కన్వీనర్