రెండు రోజుల క్రితం శ్రీశైలం పాతాళ గంగలో గల్లంతైన విద్యార్ధి ఓంకార్ మృతదేహం లభ్యమైంది. ఉల్లాసంగా విహారయాత్రకు స్నేహితులతో కలసి శ్రీశైలం వచ్చిన ఓంకార్ పాతాళ గంగలో స్నానం చేస్తూ స్నేహితుల కళ్ళముందే నీటిలో మునిగి పోయాడు. దీనితో గత రెండు రోజులుగా గజ ఈతగాళ్లతో పాతాళ గంగ లో ఓంకార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత సోమవారం ఓంకార్ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఓంకార్ స్నేహితులు కూడా తమ ఫ్రెండ్ మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.