Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ మహానాడు ఒక్క రోజు మాత్రమే.. వేదిక ఒంగోలు

Advertiesment
tdplogo
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడును ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని తీర్మానించారు. ఈ మహానాడుకు ఒంగోలు వేదికకానుంది. 
 
సాధాణంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ.రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్ విధానంలోనే ఈ పార్టీ మహానాడును నిర్వహిస్తూ వచ్చారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది ఒంగోలు కేంద్రంగా ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో ఈ మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
 
28వ తేదీన నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరూ హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారభించి వీటిని ఒక యేడాది పాటు నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షా ఇంటిని కూల్చివేస్తే దేశంలో హింస ఆగిపోతుంది : ఆప్ నేతలు