Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖజానాను ఖాళీ చేశారు.. పింఛన్ల పంపిణీకి డబ్బుల్లేవ్... టీడీపీ వల్లే ఆగిపోయాయని వైకాపా ప్రచారం!!

atchennaidu

ఠాగూర్

, ఆదివారం, 31 మార్చి 2024 (12:44 IST)
రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.. ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకుని వాలంటరీలుగా పని చేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారితో సంక్షేమ పథకాలు అందించకుండా గతంలో పంచాయతీ అధికారుల ద్వారా ఎలాగైతే ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చే వారో ఆ విధంగా అందించమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తున్నాను. 
 
ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనలతో తను చేసిన తప్పులను ఇతరుల మీద రుద్దడంలో సిద్ధహస్తుడు. శనివారం నుంచి ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీపైన అబండాలు వేయడానికి ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వల్లే పింఛను ఆగిపోయిందని ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి బృందం అంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతినెల 2000 కోట్ల రూపాయలు 31వ తారీకు అయితే 31వ తారీకు 30వ  తారీకు అయితే 30వ తారీఖు ప్రభుత్వం పెన్షన్‌దారులకు డబ్బులు రెడీ చేసి ఉంచుతుంది.
 
ఈ నెల కూడా పింఛన్ డబ్బులకు అవసరమైన 2000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఇద్దరు అందులో రూ.1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకు మున్సిపల్ శాఖకు సంబందించి బిల్లులు చెల్లించేశారు. వీరి సొంత బిల్లులను చెల్లించేసి ఇపుడు పింఛన్ ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేకుండా చేసి తెలుగుదేశం వల్లే పింఛన్లు ఇవ్వడానికి అడ్డుపడుతున్నారు అనే తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నారు.
 
జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ నాయకుల మీద ప్రజలు తిరగబడాలి జగన్ మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. ప్రజలారా ఇవన్నీ గమనించండి. వాలంటీర్ లారా మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని అవసరమైతే జీతాలు పెంచుతామని స్కిడ్ డెవలప్మెంట్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇచ్చిఅధిక ఆదాయం పెంచే విధంగా తయారు చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు. కానీ వైసీపీ నాయకులు మీరు రాజీనామా చేయండి వైసీపీ ప్రచారం చేయడం అని చెప్పి మీపై ఒత్తిడి చేస్తున్నారు. మీకు మేము అండగా ఉంటాం. ఎటువంటి తప్పుడు పని చేయకండి. ఎన్నికల కమీషన్ కేసులు పెడుతుంది. దయచేసి మీ జీవితాలు బాగు చేసుకోండి. వైసిపి నాయకుల మాటలు వినకండి అని మీ బాగుకోరే వ్యక్తిగా నేను వాలంటీర్లను అందరినీ కోరుతున్నాను. అని తెలియజేస్తున్నాను. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!