Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూతుల మంత్రిని ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారు : అచ్చెన్నాయుడు

Advertiesment
బూతుల మంత్రిని ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారు : అచ్చెన్నాయుడు
, మంగళవారం, 19 జనవరి 2021 (19:36 IST)
బూతుల మంత్రిని ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారు అంటూ టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించిన అచ్చెన్నాయుడు.. బూతుల మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరింది. ఇష్టానుసారంగా ఎవరినిపడితే వాళ్లను మాట్లాడుతున్నారు. 
 
దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నాం. పనీబాట లేని ఊరిమీద ఆంబోతులా రాష్ట్ర ప్రజలపై కొడాలి నానిని విడిచిపెట్టారు. తిట్ల మీద ఉన్న పట్టు తన శాఖపై లేదు. శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమామహేశ్వరరావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారు.? 
 
అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలి. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా? చేతనైతే చర్చకు రావాలి తప్ప కిరాయి మూకలతో అల్లర్లు సృష్టించడం ఏంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తిస్టవేశాయి. వాటిని పరిష్కరించడం చేతకావడం లేదు. ప్రజలు తంతారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు. 
 
ఇష్టమొచ్చినట్లు మొరుగుతామంటే చూస్తూ ఊరుకోం. తాగింది దిగేవరకు ఎవరినో ఒకరిని నాని తిడతారు. రెచ్చగొట్టేలా మాట్లాడిన నానిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదు.? కుట్రలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. బడిత పూజ చేస్తానన్న నాని రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? అరాచకాలను తగ్గించుకుంటే బాగుంటుంది. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. 
 
జనం ముందుకు నాని వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు. బాబాయి హత్య కేసులో మోడీ కాళ్లు పట్టుకునేందుకు జగన్ డిల్లీ వెళ్లారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నానిని జగన్ రెడ్డి వదిలారు. వైసీపీ తీరు చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌రోసారి సోనూసూద్ విత‌ర‌ణ‌.. శవాల శివకు ఆంబులెన్స్