Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈసీలో పని చేసేందుకు ఉద్యోగులు కావలెను.. ఏపీని కోరిన నిమ్మగడ్డ

ఈసీలో పని చేసేందుకు ఉద్యోగులు కావలెను.. ఏపీని కోరిన నిమ్మగడ్డ
, మంగళవారం, 19 జనవరి 2021 (17:22 IST)
రాష్ట్ర ఎన్నికల సంఘంలో పని చేసేందుకు ఉద్యోగులు కావాలని, అర్హులైన ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఈ మేరకు ఏపీ సర్కారుకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా మంత్రిత్వ శాఖ (జీఏడీ) స్పందించింది. కొంతమంది అధికారులను డిప్యుటేషన్‌పై బదిలీకి అనుమతించి, వీరిందరినీ బుధవారం రిపోర్టు చేయాల్సిందిగా జీవో జారీచేసింది.

అయితే, ఉద్యోగులు మాత్రం ఎస్ఈసీలో పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఇలాంటి వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను కలిసి తమ బాధను వినిపించుకున్నారు. కాగా, ఇటీవల జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్‌ మెడికల్ సెలవుపై వెళ్లడంతో నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. టీచర్లు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లు కొట్టివేసింది. పిటిషన్లను అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫున వాదనలు పూర్తయ్యాయి. 
 
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో హౌస్ పిటిషన్ మోషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం, ఎస్ఈసీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, నిమ్మగడ్డ తరపున డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. 
 
మంగళవారం ప్రభుత్వం వాదనలపై ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇంత వరకు ఎక్కడా జరగలేదని అన్నారు. 
 
ఈ సందర్భంగా గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాది ఆదినారాయణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపు వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలే, సర్దుకుంటాయి: రెవిన్యూ శాఖామంత్రి