Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొదట కేసీఆర్, తర్వాత చంద్రబాబు.. ఇప్పుడు గవర్నర్.. అందరూ ప్రజాస్వామ్య హంతకులేనా?

రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఫిరాయింపులును ప్రోత్సహించి టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనియాస యాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన రాజ్యాంగ ఉల్లంఘన తెలుగు రాష్ట్రాల్లో నేటికీ కొనసాగుతోంది. తలసాని ఫిరాయింపుపై మండిపడ్డ ఏప

Advertiesment
మొదట కేసీఆర్, తర్వాత చంద్రబాబు.. ఇప్పుడు గవర్నర్.. అందరూ ప్రజాస్వామ్య హంతకులేనా?
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (08:39 IST)
రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఫిరాయింపులును ప్రోత్సహించి టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనియాస యాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన రాజ్యాంగ ఉల్లంఘన తెలుగు రాష్ట్రాల్లో నేటికీ కొనసాగుతోంది. తలసాని ఫిరాయింపుపై మండిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి ఆ చరిత్రను దులుపుకుని ఇప్పుడు ఏకంగా నలుగురు వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ద్వారా అతడి కంటే ఘనుడు అచంటం మల్లన్న అని నిరూపించుకున్నారు.
 
వీళ్లిద్దరూ రాజకీయ నాయకులు అధికారం కోసం, ప్రభుత్వ బలోపేతం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కే అవకాశాలు వీళ్లకు ఉన్నాయి. కానీ గవర్నర్ విచక్షణ ఏమైంది. తలసాని యాదవ్ విషయంలో ఆయన చూపిన ఉదాసీనత ఇప్పుడు ఏపీలో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం వరకు దేకింది. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు వ్యవహారాల్లో గవర్నర్‌ది మూగపాత్ర కాదు. రాజ్యాంగాన్ని నగ్నంగా ఉల్లంఘించిన చర్యలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసి ఈ పాపంలో అగ్రభాగం తానే తీసుకున్నారు. రాజకీయ నాయకులకు లేని బాధ నాకెందుకు అనుకున్నప్పుడే ఈ మాజీ పోలీసు అధికారి తన విలువలను మొత్తంగా దిగజార్చుకున్నారు. 
 
కేసీఆర్, చంద్రబాబు, నరసింహన్ ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఒక దుష్టచరిత్రకు బాటలేశారు. ఈ దుస్సంప్రదాయం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగే ప్రమాదముంది. ఇది ఏ స్తాయికి చేరుతుందంటే ఇకపై మనం రాష్ట్రాల్లో ఒక పార్టీనే చూస్తాం, ప్రతిపక్షం గెల్చుకున్న స్థానాలనుకూడా లాగేసుకుంటే అధికార  పక్ష మాత్రమే ఉనికిలో ఉంటుంది. అప్పుడిక మాట్లాడే స్వేచ్చ ఉండదు. నిలదీసే హక్కు ఉండదు. పాలక పార్టీలు తమను ఎవరు ప్రశ్నించినా సహించే సమస్యే లేదు.ట
 
ఇక్కడ ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే కేసీఆర్, చంద్రబాబు కలిసి వ్యవస్థను చంపేశారు. కోర్టులు, స్పీకర్లు, గవర్నర్, కేంద్రం అందరూ ఈ హత్యలో తమ వంతు పాత్ర పోషించారు. అయితే తాము శాశ్వతంగా ఏపీ తెలంగాణలను పాలించలేమన్న సత్యాన్ని చంద్రబాబు, కేసీఆర్ గ్రహించక తప్పదు. ఒక్కసారి వారు ఎన్నికల్లో ఓడిపోవడం అంటూ జరిగితే వాళ్లు పాటించి,  ప్రతిష్టించిన ఈ దుస్సంప్రదాయం వారికే ప్రమాదకరంగా మారక తప్పదు. అధికారం మత్తులో ఉన్న ఈ సమయంలో ఈ నిజం వారికి బోధపడదు.
 
తెలిసి తెలిసి ఊబిలోకి దిగిన ఇద్దరు ముఖ్యమంత్రులూ భవిష్యత్తులో తమ పార్టీల్లోంచి ఫిరాయింపుల గురించి నోరెత్తే అవకాశాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్నట్లే. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు దశాబ్దాల సర్వీసును మూడు క్షణాల్లో విసిరేస్తారా: కుమిలిపోతున్న బొజ్జల