Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు దశాబ్దాల సర్వీసును మూడు క్షణాల్లో విసిరేస్తారా: కుమిలిపోతున్న బొజ్జల

తనను మంత్రివర్గంలోంచి తొలగించడానికి అనారోగ్యాన్ని సాకుగా ప్రచారం చేసి చివరి క్షణంలో తనను కేబినెట్ నుంచి తొలగించిన చంద్రబాబు వైఖరి పట్ల మాజీమంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తర

మూడు దశాబ్దాల సర్వీసును మూడు క్షణాల్లో విసిరేస్తారా: కుమిలిపోతున్న బొజ్జల
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (06:05 IST)
తనను మంత్రివర్గంలోంచి తొలగించడానికి అనారోగ్యాన్ని సాకుగా ప్రచారం చేసి చివరి క్షణంలో తనను కేబినెట్ నుంచి తొలగించిన చంద్రబాబు వైఖరి పట్ల మాజీమంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తరపున ఎవ్వరొచ్చినా, చివరకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్ తన ఇంటికొచ్చి బుజ్జగించినా బొజ్జల చల్లబడలేదు. మంత్రివర్గంనుంచి తమ నేతకు ఉద్వాసన పలకడంపై బొజ్జల అనుచర వర్గం  రగిలిపోతున్నట్లు సమాచారం. 
 
కీలక సమయాల్లో చంద్రబాబు వెన్నంటి నడిచిన తనను ఇలా అవమానించి సాగనంపుతారా అని బొజ్జల చంద్రబాబును, ఆయన తరపున చర్చలకు వచ్చిన వారిని నిలదీశారు. మూడు దశాబ్దాలపాటు టీడీపీకి ఎంతో కృషిచేసినా తనను అగౌరవపరిచేలా మంత్రి పదవి నుంచి తొలగించడంపై బొజ్జల తీవ్రంగా కలత చెందారని ఆయన అనుయాయులు చెప్పారు. పార్టీ  తీసుకున్న నిర్ణయం దారుణమని బొజ్జల తన అనుచరులతో చెప్పడంతో వారంతా ఆయనకు మద్దతుగా ఒక్కటయ్యారు.
 
బుధవారం లేదా గురువారం శ్రీకాళహస్తికి రానున్న బొజ్జల తెలుగుదేశం పార్టీలో అటో ఇటో తేల్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు జరిపి తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండున్నర కోట్లమంది రైతుల నెత్తిన పాలు పోసిన యోగి.. లక్ష రుణమాఫికి గ్రీన్ సిగ్నల్