రోశయ్య ఇక రిటైర్... వయసు 83 ఏళ్ళు... ముఖ్యమంత్రి జయ తెలుగులో విషెస్...
చెన్నై : కాంగ్రెస్ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ గవర్నర్... కొణిజేటి రోశయ్య ఇక రిటైర్ అయిపోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 60 ఏళ్లకు పైగా వివిధ పదవుల్ని నిర్వహించిన రోశయ్య రిటైర్డ్ లైఫ్ ప్లాన్ చే
చెన్నై : కాంగ్రెస్ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ గవర్నర్... కొణిజేటి రోశయ్య ఇక రిటైర్ అయిపోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 60 ఏళ్లకు పైగా వివిధ పదవుల్ని నిర్వహించిన రోశయ్య రిటైర్డ్ లైఫ్ ప్లాన్ చేసుకున్నారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఇప్పటికే ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో... ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఉమ్మడి ఏపీకి 14 నెలలు ముఖ్యమంత్రిగా సేవలందించారు రోశయ్య. ఆర్థిక మంత్రిగా ఆయన దశాబ్దాలుగా ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ మంత్రి పదవులను నిర్వహించారు. లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. శాసన మండలి ప్రతిపక్షనేతగా పనిచేశారు. సుదర్ఘీ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య రాజకీయాలకు స్వస్తి పలికి, హైదరాబాద్ లోని సొంత నివాసంలో విశ్రాంతికి ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ పదవి బుధవారం ముగియడంతో ఆ బాధ్యతలను విద్యాసాగర రావుకు రోశయ్య అప్పగించారు.
శుక్రవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రోశయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో తెలుగులో మాట్లాడారు. రోశయ్య కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. రాష్ట్రానికి రోశయ్య చేసిన సేవలను మరువలేమని ఆమె అన్నారు.