పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమైన వ్యక్తి... నారా లోకేష్ ట్వీట్
ప్రత్యేక హోదాపై దాదాపు తెదేపాను పరోక్షంగా విమర్శించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఐతే ప్రభుత్వానికి ఉండే బాధలు ఉంటూనే ఉంటాయని మరోపక్క ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పడుతున్న బాధలను కూడా ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు. ఐతే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం గట్టిగా
ప్రత్యేక హోదాపై దాదాపు తెదేపాను పరోక్షంగా విమర్శించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఐతే ప్రభుత్వానికి ఉండే బాధలు ఉంటూనే ఉంటాయని మరోపక్క ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పడుతున్న బాధలను కూడా ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు. ఐతే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం గట్టిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత తెదేపా నాయకులు తలోరకంగా ఆయనపై ఫైర్ అయ్యారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.
శుక్రవారం సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా ...''పవన్ కల్యాణ్ ఒక వండర్ ఫుల్ పర్సన్. సరైన వ్యక్తిత్వం కల్గిన మనిషి. పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్‌కు రానున్న రోజులు మరింతగా బాగుండాలని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశారు.