Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం బాబుపై ఒంటికాలిపై లేస్తున్న తమిళనాడు సీఎం జయ, మాజీ సీఎం కరుణ... ఎందుకబ్బా?

రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు శత్రువు పార్టీ అని కూడా చూడరు. ఇంకా కనీసం అప్పటివరకూ ఇతనితో నాకేంటి పని అనుకునేవాళ్లు సైతం మెల్లిమెల్లిగా పెదాలను సాగదీస్తూ నవ్వులు చిందిస్తుంటారు. రాజకీయాలంటే అంతే. అంత

Advertiesment
Tamilnadu cm jayalalithaa
, సోమవారం, 8 ఆగస్టు 2016 (18:16 IST)
రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు శత్రువు పార్టీ అని కూడా చూడరు. ఇంకా కనీసం అప్పటివరకూ ఇతనితో నాకేంటి పని అనుకునేవాళ్లు సైతం మెల్లిమెల్లిగా పెదాలను సాగదీస్తూ నవ్వులు చిందిస్తుంటారు. రాజకీయాలంటే అంతే. అంతేకాదండోయ్... మిత్రుడేలే అనుకునేలోపే మళ్లీ ఆగ్రహాన్ని చూపిస్తారు. దీన్నిబట్టి వాళ్లేదో రాజకీయం మొదలుపెట్టారని తెలుసుకోవచ్చు. ఇదంతా ఎందుకయా అంటే.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇద్దరూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒంటికాలిపై లేస్తున్నారట. 
 
దీనికి కారణం ఏంటంటే... శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్న కూలీలే. అప్పట్లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లో 18 మంది తమిళ కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా తమిళ కూలీలు మాత్రం ఎర్రచందనం నరికివేతను ఆపడం లేదు. దీనితో ఏపీ పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి దొంగల తాట తీస్తున్నారు. తాజాగా 32 మంది తమిళ కూలీలు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగల కోసం ఆయుధాలతో తిరుమలకు బయలుదేరారు. వీరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు. 
 
ఈ వ్యవహారం తమిళనాడు ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో అదుపులోకి తీసుకున్న తమిళ కూలీలు అమాయకులనీ, వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఇద్దరు న్యాయవాదులను సైతం రంగంలోకి దింపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. దీనిపై మాజీ సీఎం కరుణానిధి కూడా చంద్రబాబు నాయుడుకి ఓ లేఖ రాశారు. వారు అమాయకులంటూ వెల్లడించారు. ఇక మిగిలిన తమిళ ప్రతిపక్షాలైతే చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మరి ఏపీ సీఎం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రత్యేక హోదా: చిరుకు 150వ సినిమానే ముఖ్యమా..? 11 పార్టీలు గుసగుస..!!