Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ ప్రత్యేక హోదా: చిరుకు 150వ సినిమానే ముఖ్యమా..? 11 పార్టీలు గుసగుస..!!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో రచ్చ రచ్చ జరిగింది. కేవీపీ పెట్టిన బిల్లుకు దేశంలోని పలు పార్టీలు తమ మద్దతు తెలిపాయి. కానీ ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలను చర్చించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప

ఏపీ ప్రత్యేక హోదా: చిరుకు 150వ సినిమానే ముఖ్యమా..? 11 పార్టీలు గుసగుస..!!
, సోమవారం, 8 ఆగస్టు 2016 (17:47 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో రచ్చ రచ్చ జరిగింది. కేవీపీ పెట్టిన బిల్లుకు దేశంలోని పలు పార్టీలు తమ మద్దతు తెలిపాయి. కానీ ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలను చర్చించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకి ఆ పార్టీ ఎంపీ అయిన మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంపై ఇతర 11 పార్టీలు మండిపడుతున్నాయి. 
 
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పెషల్ స్టేటస్ కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై తెలుగుదేశం ఎంపీలతో పాటు ఇతర 11 పార్టీలు మద్దతిచ్చిన నేపథ్యంలో.. ఈ బిల్లుపై చర్చ, ఓటింగ్ ఉంటాయని తెలిసినా, ఏపీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, నటుడు చిరంజీవి మాత్రం సభకు హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన 150వ సినిమా షూటింగ్‌ను వదిలిపెట్టకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. దీనిపై టీడీపీతో పాటు ఇతర 11 పార్టీల ఎంపీలు ఫైర్ అవుతున్నారు. చిరంజీవికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, ప్రత్యేక హోదా కంటే.. తన 150వ సినిమానే ముఖ్యమా అంటూ మెగా వైఖరిపై మండిపడుతున్నారు. 
 
అంతేగాకుండా ఈ బిల్లు విషయంపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వారు ఫైర్ అవుతున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును జీఎస్టీ బిల్లుతో ఎందుకు లింక్ పెట్టలేదని సీఎం చంద్రబాబుతో పాటు ఇతర పార్టీ ఎంపీలు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంత జరిగినా.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం స్పెషల్ స్టేటస్‌పై తమ వాణి వినిపించేందుకు పార్లమెంట్ గడప తొక్కకపోవడంతో విమర్శపాలయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాచీన హోదా.. తెలుగు భాషకు అన్నీ అర్హతలున్నాయ్ : మద్రాస్ హైకోర్టు