సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడంతో పాటు మీరు పెట్టిన పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
"సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనలతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు. తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదేసమయంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. అరెస్టు నుంచి 2 వారాల పాటు మధ్యంత ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.