శ్రీ సూర్య నారాయణ అంటూ, భక్తజనం జయజయద్వానాల మధ్య అరసవల్లి దేవాలయం మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో సాక్షాత్కరించిన అద్భుత దృశ్యం ఇది. సూర్య భగవానుడి ఆలయంలో కనువిందు చేసిన సూర్య కిరణాలు స్వామివారి మూల విరాట్ ను తాకాయి. ప్రతి ఏడాది ఈ అద్బుతం ఆవిష్కృతం అవుతుంది.
ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా స్వామి వారిని సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్త జనం తరలివచ్చారు. జై సూర్యనారాయణ అంటూ సూర్యదేముడికి నమస్కరాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు చేసి, సూర్యనారాయణుడి అనుగ్రహం కోసం సేవలు చేశారు. ఏటా ఈ రోజు సూర్యుని కిరణాలు ఇలా స్వామి వారి మూలవిరాట్టు పాదలను సృశిస్తాయి. ఈ వింతను చూడటానికి భక్తజనం ఉదయాన్నే అరసవల్లి క్షేత్రానికి చేరతారు.